News February 25, 2025
కంచికచర్ల: ప్రమాదంలో ఇద్దరి మృతి.. వివరాలివే..!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద బైకు అదుపు తప్పి డి వైడర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), కరిముల్లా(30),లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉయ్యూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News February 25, 2025
కృష్ణా జిల్లా: TODAY TOP NEWS

* జిల్లావ్యాప్తంగా మూతపడ్డ మద్యం దుకాణాలు * MLC ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ * వల్లభనేని వంశీకి ముగిసిన విచారణ.. జైలుకు తరలింపు * గన్నవరంలో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి * VJA: మసాజ్ సెంటర్‌పై కేసు.. చర్యలకు రంగం సిద్ధం * కృష్ణా: MLC ఎన్నికలు.. పరీక్షల వాయిదా * ఉంగుటూరు: వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్ * 27న GOVT ఉద్యోగులకు Special క్యాజువల్ లీవ్: కలెక్టర్
News February 25, 2025
నోడల్ ఆఫీసర్లదే కీలక పాత్ర: కలెక్టర్

ఈ నెల 27న జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్రే కీలకమని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లో నోడల్ ఆఫీసర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News February 25, 2025
విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.