News April 28, 2024
కంచిలి: రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన కారు

మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 7, 2025
SKLM: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News December 7, 2025
విశాఖలో శ్రీకాకుళం మహిళ హత్య

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవిని పెందుర్తి సుజాతనగర్లోని ఆమె సహజీవన భాగస్వామి శ్రీనివాస్ కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం జరగగా, హత్య చేసి శ్రీనివాస్ పరారయ్యాడు. నిందితుడు ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 7, 2025
NMMS పరీక్షకు 5516 మంది హాజరు: DEO

శ్రీకాకుళం జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజరయ్యారని DEO కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.


