News December 30, 2024
కంచిలి: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

కంచిలి జాతీయ రహదారి పక్కన పబ్జీ దాబా సమీపంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మండలంలోని బాసు బంజీరికి చెందిన బొండాడ రామారావు (45) విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేకల ఆహారానికి దాబా సమీపంలోని పొలానికి వెళ్లారు. చెట్టు కొమ్మలు కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్కు గురయ్యాడని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News October 23, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➾SKLM: జలజీవన్ మిషన్పై సమీక్ష
➾రావివలస ఎండల మల్లన్న దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తా: అచ్చెన్న
➾శ్రీకాకుళంలో వైసీపీ రచ్చబండ
➾ప్రజా సమస్యలను పరిష్కరించాలి:ఎమ్మెల్యే శిరీష
➾జలమూరు: ప్రధాన రహదారిపై నిలిచిన నీరు
➾బూర్జ: లక్కుపురంలో కుళాయిలు నుంచి బురద నీరు
➾SKLM: విద్యార్థులకు అసెంబ్లీలో పాల్గొన్న అవకాశం
➾ఆముదాలవలసలో కుక్కలు స్వైరవిహారం
News October 22, 2025
పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.