News February 25, 2026
కంచె వేసినదే కమతము

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.
Similar News
News April 16, 2026
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్: ట్రంప్

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు సీజ్‌ఫైర్ అమలు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల అధినేతలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించినట్లు తెలిపారు. వాషింగ్టన్‌లో ఈ రెండు దేశాల నేతలు కలుసుకోవడం 34ఏళ్లలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు తొమ్మిది యుద్ధాలు ఆపానని, ఇది పదోది కాబోతోందని చెప్పుకొచ్చారు.
News April 16, 2026
ముంబై స్కోర్ ఎంతంటే?

IPL: పంజాబ్‌తో మ్యాచులో ముంబై 20 ఓవర్లలో 195/6 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ సెంచరీతో అదుర్స్ అనిపించారు. 60 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 112* రన్స్ చేశారు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50) రాణించారు. రికెల్టన్ (2), సూర్య (0), పాండ్య (14), రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు.
News April 16, 2026
మాజీ పీఎంలనూ వదలని బాలెన్ షా!

నేపాల్ పీఎం బాలెన్ షా సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. తన ప్రభుత్వంలోని పలువురు సహా గత ప్రభుత్వాల్లోని పీఎంలు, అధికారులు, మంత్రుల ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించారు. ఫేజ్-1లో 2006 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు, ఫేజ్-2లో 1991-2005 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న పార్టీల నేతలపై దర్యాప్తు చేయించనున్నారు. ఇందులో దాదాపు 17 మంది మాజీ దేశాధినేతలు, ఎక్స్ పీఎంలు ఉన్నట్లు సమాచారం.


