News April 10, 2024

కంటోన్మెంట్‌లో గెలుపు ఎవరిది?

image

పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక BRS MLA లాస్య నందిత యాక్సిడెంట్‌లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా BRS నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే BRS నుంచి BJPలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. BJP ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో?

Similar News

News November 27, 2025

HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

image

హైదరాబాద్‌లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐబొమ్మ రవి: కస్టడీల పరంపర కొనసాగుతుందా?

image

ఐబొమ్మ రవిని పోలీసులు మరో కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్లు తెలిసింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదుచేశారు. ఈ కేసులన్నింటినీ విచారణ జరపాలంటే కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల భావన. దీంతో మొత్తం కేసుల్లోనూ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.