News April 18, 2024
కంటోన్మెంట్: నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్
కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు కేసీఆర్ బీఫాంను, రూ.40 లక్షల చెక్కును తెలంగాణ భవన్లో అందించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న-లాస్యనందిత అందించిన సేవలవైపే ఉన్నాయని అన్నారు.
Similar News
News September 18, 2024
HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి
RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2024
HYD: లడ్డూ వేలం.. ఏ ప్రాంతంలో ఎంతంటే..?
✓బండ్లగూడ జాగీర్ రిచ్మండ్ విల్లాస్లో రూ.1.87 కోట్లు
✓బాలాపూర్ గణపతి రూ.30,01,000
✓కొంపల్లి అపర్ణ మెడోస్ రూ.29.10 లక్షలు
✓శంకర్పల్లి విఠలేశ్వరుడి వద్ద రూ.12.51 లక్షలు
✓అత్తాపూర్ భక్త సమాజ్ రూ.11.16 లక్షలు
✓ఉప్పరపల్లి వీరాంజనేయాలయంలో రూ.10 లక్షలు
✓చేవెళ్ల ఖానాపూర్లో రూ.6.63 లక్షలు
✓బాచుపల్లి బడా గణేశ్ రూ.6.2 లక్షలు
✓శంకర్పల్లి పర్వేదలో రూ.4 లక్షలు
మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి
News September 18, 2024
HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్
విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్లో ఉంది.