News June 18, 2024

కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా?

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది. 

Similar News

News January 24, 2026

HYD: ‘జూబ్లీహాల్’ పేరెలా వచ్చిందంటే?

image

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్‌(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్‌’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?

News January 24, 2026

HYD: కబ్జా జరిగిందా.. 9000113667కు కాల్ చేయండి

image

హైదరాబాద్ నుంచి ORR వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, లేఅవుట్ ఆక్రమణలు, పార్కుల కబ్జాలు ఉంటే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. హైడ్రా హెల్ప్‌లైన్ 040-29565758కు కాల్ చేసి తెలియజేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో (DRF) 9000113667కు నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.