News April 24, 2024

కంటోన్మెంట్ BRS అభ్యర్ధి‌గా నివేదిత నామినేషన్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్థిగా నివేదిత మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నాయకులతో కలిసి RO మధుకర్ నాయక్‌కు పత్రాలు అందజేశారు. తన తండ్రి చేసిన అభివృధి, BRS ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News January 26, 2025

HYD: నేడు భారతమాతకు మహాహారతి కార్యక్రమం

image

HYDలోని పీపుల్స్ ప్లాజాలో నేడు భారత మాతకు మహాహారతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం భారతమాత విగ్రహాన్ని HMDA మైదానం నుంచి ఊరేగింపుగా నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లారు. సంవిధాన్ గౌరవ అభియాన్ యాత్ర నేడు ప్రారంభించి 2026 జనవరి 26 వరకు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

News January 26, 2025

HYD: చిట్టి భరతమాత.. అదుర్స్ కదూ!

image

రిపబ్లిక్ డే వేడుకలు గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పరిధి ఆరుట్లకు చెందిన శ్రుతి తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తెను భరతమాతగా అలంకరించి వావ్ అనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News January 26, 2025

HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్

image

దావోస్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.