News March 20, 2025

కందికి మద్దతు కల్పిస్తాం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మర్రిపూడి మండలం చిమటలో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. చిమటలో 35 టన్నుల కందిని రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేశామన్నారు.

Similar News

News March 21, 2025

ALERT: ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాతో పాటు అల్లూరి, మన్యం YSR, నంద్యాల, పల్నాడు(D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

News March 21, 2025

ప్రకాశం జిల్లాలోని ఆ ప్రాంతాలలో ఎన్నికలు

image

ప్రకాశం జిల్లాలో మార్కాపురం MPP, త్రిపురాంతకం MPP, పుల్లలచెరువు వైస్ MPP, ఎర్రగొండపాలెం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం తెలిపారు. 23వ తేదీన సభ్యులకు నోటీసులు అందించాలన్నారు. 27వ తేదీన MPP, వైస్ MPP పదవులకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపిక చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

News March 21, 2025

ప్రకాశం: ఆ పాఠశాలలు మధ్యాహ్నం ప్రారంభం.!

image

ప్రకాశం జిల్లాలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత యాజమాన్యాలు పాఠశాలలను నిర్వహించాలన్నారు. టెన్త్ క్లాస్ పరీక్ష లేనిరోజు కూడా మధ్యాహ్నం సమయంలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!