News March 22, 2024

కందికుంట వెంకటప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు

image

కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.

Similar News

News April 16, 2026

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: ఎస్పీ

image

అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో SP జగదీష్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష జరిగింది. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, మట్కా, బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నైట్ సేఫ్టీ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.

News April 16, 2026

గ్రామగ్రామాన సీఎం బర్త్ డే వేడుకలు: పూల నాగరాజు

image

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈనెల 20న గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

News April 15, 2026

ఇంటర్ రిజల్ట్స్: అనంతపురం జిల్లాకు 15వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు <<19653702>>సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 21,730 మందికి 15,814 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 20,320 మంది పరీక్షలు రాయగా 15,530 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది.