News March 1, 2025
కంది: ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కంది పరిధిలోని ఐఐటీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీ డైరెక్టర్ మూర్తితో కలిసి శనివారం పరిశీలించారు. 2న ఉపరాష్ట్రపతి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అదనపు కలెక్టర్ మాధురి ,అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
ఏలూరు: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

భీమడోలు, చేబ్రోలు, నిడమర్రు, గణపవరం, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. నిందితుల నుంచి 65 గ్రాముల పసిడి వస్తువులను రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.6,50,000 ఉంటుందన్నారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ చూపిన పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.
News November 5, 2025
రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.
News November 5, 2025
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: MLC బొత్స

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో రైతులు నష్టపోయినా ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగితే ప్రైవేట్ ఆలయం అంటారా? ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తున్నారని అన్నారు.


