News July 12, 2024
కంది: ఉపాధ్యాయురాలి సస్పెండ్

సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు తన్వీర్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని దండించారని తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. మండల విద్యాధికారి నివేదిక ఆధారంగా టీచర్ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: EC

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 9, 2025
వంద శాతం ఓటింగ్లో పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజలు వంద శాతం ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మొదటి విడత ఎన్నికల్లో 160 గ్రామ పంచాయతీల్లో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 జీపీలకు 411 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 1402 వార్డుల్లో 332 ఏకగ్రీవం కాగా, పాపన్నపేటలోని అరికెలలో రెండు వార్డులకు నామినేషన్లు రాలేదన్నారు.
News December 9, 2025
మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.


