News March 31, 2025

కంది: నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

image

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్‌ల యజమానులందరూ పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు నేటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

KNRలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు

image

KNR జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ షేక్ యాకుబ్ అలీ వాయుసేనలో చేరడం ఎలా, వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం, సిలబస్, పూర్తి సెలక్షన్ వివరాలను అభ్యర్థులకు వివరిస్తారని తెలిపారు. ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.

News November 2, 2025

ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.

News November 2, 2025

పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

image

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.