News June 5, 2024
కందుకూరును ప్రకాశంలో కలుపుతా: ఇంటూరి

కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News November 18, 2025
ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.