News June 5, 2024
కందుకూరును ప్రకాశంలో కలుపుతా: ఇంటూరి
కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News November 7, 2024
ప్రకాశం: 10వ తరగతి విద్యార్థులకు గమనిక
ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు డీఈవో కిరణ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పదో తరగతి పరీక్ష ఫీజు కట్టేందుకు ఈనెల 18వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. రూ.50 ఫైన్‌తో 25వ తేదీలోగా, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 3, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 10వ తేదీలోపు ఫీజు కట్టవచ్చని సూచించారు. ఆయా పాఠశాలల HMలు WWW.BSE.AP.GOV.IN ద్వారా చెల్లించాలని చెప్పారు.
News November 7, 2024
ప్రకాశం: మహిళా సాధికారతకు సహాయక సంఘాల కృషి
మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ నిర్వహణపై జిల్లా స్థాయి వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలను, స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 6, 2024
ఒంగోలు: జాబ్ మేళాలో ఎంపికైన వారు వీరే.!
ఒంగోలు నగరంలోని A-1 ఫంక్షన్ హల్‌లో బుధవారం ఒంగోలు MLA దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు వేలాదిగా వచ్చారు. షార్ప్ ఇండియా వారి సహకారంతో సుమారుగా.. 38 కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కంపెనీలకు 3650 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరయ్యారు. అందులో 1262 మంది ఏంపికయ్యారు. ఎంపికైనా వారి అందరికీ MLA దామచర్ల చేతుల మీదగా ఆఫర్ లెటర్ అందజేశారు.