News June 4, 2024

కందుకూరులో టీడీపీ గెలుపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. సమీప ప్రత్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై 17,813 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా టీడీపీ ఇప్పటివరకు 7 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే.

Similar News

News October 16, 2025

ఉపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్ ఆదేశం

image

నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో బుధవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థితిగతులు, కొత్త వాటిని స్థాపించేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి అధికారులు వివరించగా, కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News October 15, 2025

రేపు కూడా ప్రకాశం జిల్లాకు భారీ వర్షసూచన

image

ప్రకాశం జిల్లాలో గురువారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. అలాగే భారీ హోర్డింగ్ ల వద్ద, చెట్ల వద్ద వర్షం సమయంలో నిలబడరాదన్నారు. కాగా బుధవారం సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది.

News October 15, 2025

ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

image

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.