News February 15, 2025
కందుకూరు: చంద్రబాబు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి.!

సీఎం చంద్రబాబు కొద్ది సేపట్లో కందుకూరు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చే అంశంపై ఆయన ఏం చెప్తారో అన్న ఆసక్తి నియోజకవర్గ ప్రజలలో నెలకొంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేరుస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2025
ప్రకాశం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి.!

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్తున్న తండ్రీకొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య(60), మాదాల వెంకటేశ్వర్లు(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 22, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్ హెచ్చరికలు జారీ

జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
News October 22, 2025
ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఇసుకను ఒంగోలుకు తరలిస్తున్నారని ఫలితంగా ఒంగోలులో ఇసుక యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ రాజా బాబుకు రవాణాదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు.