News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

Similar News

News December 10, 2025

ప్రకాశం జిల్లాలో 2కు చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. వారం రోజుల వ్యవధిలో స్క్రబ్ టైఫస్‌తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో ఇదే వ్యాధి లక్షణాలతో ఎర్రగొండపాలెం మండలంలో ఓ మహిళ మృతి చెందగా.. తాజాగా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన మహిళ మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదని.. అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్‌లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్‌లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్‌పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

➡️ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి➡️ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్ లను అనుమతించరు➡️ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్ లో లేకుంటే డీఈఓను సంప్రదించాలి➡️ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని,లు అదనపు సమయం➡️ హాల్ టికెట్ పై నో ఫోటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం➡️ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు➡️ గ్రీవెన్స్ సెల్ : 9848527224