News February 6, 2025
కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.
Similar News
News October 22, 2025
మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న కాగితాల పూర్కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 22, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 22, 2025
పెంచలకోన వాటర్ఫాల్స్కు రాకండి: ఎస్ఐ

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్ఫాల్స్కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.