News June 12, 2024

కందుల దుర్గేశ్ అను నేను..

image

రాష్ట్ర మంత్రిగా నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు నినాదాలు చేశారు.

Similar News

News December 21, 2025

రేపు భీమవరానికి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

image

అటల్-మోదీ సుపరిపాలన బైక్ ర్యాలీ సోమవారం భీమవరం చేరుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ యాత్రలో కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, సత్య కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా MLAలు పాల్గొంటారన్నారు. బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

News December 21, 2025

కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.

News December 21, 2025

ఈనెల 22న వీరవాసరంలో జిల్లాస్థాయి సైన్ ఫెయిర్

image

ఈ నెల 22న వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈవో నారాయణ తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్లో పాఠశాలల నుంచి మండల స్థాయికి ఎంపికైన, మండల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శిస్తారన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైన ఎగ్జిబిట్స్ ముందు రోజే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.