News June 12, 2024
కందుల దుర్గేశ్ అను నేను..

కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దుర్గేశ్ వివిధ హోదాల్లో పనిచేసి MLC అయ్యారు. తూ.గో. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాజమండ్రి MPగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరి 2019లో రాజమండ్రి గ్రామీణం నుంచి MLAగా పోటీచేసి ఓటమి చెందారు. తాగా ఎన్నికల్లో నిడదవోలు నుంచి 33,304 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.
Similar News
News March 26, 2025
రాజమండ్రి: పాస్టర్ మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై రాజమండ్రి ఆసుపత్రి ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆయన మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ అంశంపై.. ఎవరూ రాజకీయంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని కోరారు.
News March 26, 2025
నల్లజర్ల : శిశువు మృతి

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
News March 26, 2025
అనపర్తి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులు

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.