News August 18, 2024
కంభం: చంద్రబాబుపై అనుచిత పోస్ట్ పెట్టిన మహిళ అరెస్ట్
కంభం పట్టణంలో సీఎం చంద్రబాబును అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు పెట్టిన ఓ మహిళను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోస్టు పెట్టిన వారిని గుర్తించారు. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ పోస్ట్ పెట్టినట్లుగా గుర్తించి ముందుగా నోటీసు ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 16, 2024
చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్
చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
News September 16, 2024
చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్
చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
News September 16, 2024
పెద్దారవీడు: కొట్లాట ఘటనపై ముమ్మర దర్యాప్తు
పెద్దారవీడు మండలం రాజంపల్లి పొలాల్లో <<14111250>>ఆదివారం కర్రల దాడి<<>>లో గాయపడిన బాధితులు మార్కాపురం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, అల్లూరెడ్డిలు కర్రలతో దాడికి దిగగా.. ఈ దాడిలో కంచర్ల చెన్నకేశవులు, కంచర్ల అంజమ్మ, చరణ్, రామాంజనేయులు, రాములమ్మతోపాటు మరొకరికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యప్తంగా సంచలనం రేపగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.