News July 4, 2024
కంభం: SIపై SPకి ఫిర్యాదు

పల్నాడు జిల్లా మాచర్ల SI బత్తుల గోపాల్పై SP మలికాగార్గ్కు ప్రకాశం జిల్లా, కంభం మండలం, రావిపాడుకు చెందిన కోట వెంకట సుబ్బయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. గతేడాది జూన్లో వెంకట సుబ్బయ్యకు చెందిన 3.75 ఎకరాల పొలాన్ని ఎస్సై గోపాల్ తన భార్య వరలక్ష్మి పేరుతో రూ.37లక్షలకు కొన్నారు. రూ.24లక్షలు చెల్లించగా.. మిగతా రూ.13లక్షలు ఇవ్వాలని అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Similar News
News October 14, 2025
ప్రకాశం: ‘ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలి’

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ఏర్పాటుచేసిన గోడ పత్రికను కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతుల పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరవని అన్నారు.
News October 13, 2025
కొనకనమిట్ల వద్ద ప్రమాదం.. మరో ఇద్దరు స్పాట్డెడ్.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురురాళ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా CSపురం వద్ద <<17997659>>గంటక్రితం ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే.
News October 13, 2025
రేపు ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో ప్రకాశంకు రేపు వర్ష సూచన ఉన్నట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు.