News March 3, 2025
కట్నం కోసం వేధిస్తున్న భర్తకు జైలు శిక్ష: ఎస్పీ

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎస్.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన జామి అప్పలరాజు కటకటాలపాలయ్యాడు. 13వ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఆదివారం తెలిపారు. భార్య ధనలక్ష్మి 2015 ఫిబ్రవరి 20వ తేదీన అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
Similar News
News July 6, 2025
తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్‌తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
54 ఏళ్ల తర్వాత..

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.
News July 5, 2025
ఏలూరు: SDG లక్ష్యాలను సాధిస్తాం

ఉభయగోదావరి జిల్లాలోని పంచాయతీ అధికారులకు పంచాయతీ పురోగతి సూచికపై శనివారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ కార్యనిర్వాహణాధికారి శ్రీహరి మాట్లాడారు. SDG కి సంబంధించిన 227 డేటా పాయింట్స్ ని PAI వెబ్ సైట్లో పొందుపరచడంపై శిక్షణ ఇవ్వడం జరిగినదని తెలిపారు. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామన్నారు.