News March 18, 2025

కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

image

జడ్చర్ల మండలంలో <<15786400>>నవవధువు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్తమామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

Similar News

News November 20, 2025

రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్‌ చేశారు. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 20, 2025

ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.

News November 20, 2025

ధాన్యం, పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

image

ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యానికి రైస్ మిల్లుల వద్ద కోతలు విధించవద్దని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో పాటిస్తున్న విధానాన్నే పత్తి కొనుగోలుకు కూడా పాటించాలన్నారు. గ్రామాల్లోనే తేమ శాతం చూడాలని సూచించారు.