News August 14, 2024

కడపకు చేరుకున్న మంత్రి ఫరూక్

image

రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రేపు కడప పోలీస్ మైదానంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జండా వందనం చేస్తారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు తన సందేశంలో వినిపిస్తారు.

Similar News

News January 15, 2025

ఎర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి

image

ఎర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్‌ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.

News January 15, 2025

కడప రెగ్యులర్ RJDగా శామ్యూల్

image

కడప రెగ్యులర్ RJD (పాఠశాల విద్యాశాఖ)గా కె.శామ్యూల్ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కె.శామ్యూల్ కడప జిల్లా RJDగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కడప జిల్లా RJDగా తన విధులను నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు తెలిపారు.