News November 14, 2024
కడపకు రానున్న గ్లోబల్ స్టార్ రామ్చరణ్

ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.


