News November 14, 2024

కడపకు రానున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్

image

ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2024

కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!

image

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

News December 6, 2024

పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి

image

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్‌ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

News December 6, 2024

కడప: ‘రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలి’

image

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.