News May 3, 2024

కడపకు రానున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి?

image

కడపకు ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రానున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్‌తో పాటు పలువురు నాయకులు రానున్నట్లు తెలుస్తోంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వీరు ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Similar News

News November 12, 2024

ప్రొద్దుటూరు: సినీ పక్కీలో భారీ దొంగతనం

image

కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని నంగనూర్‌పల్లిలో మంళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. RTC ఏఎస్ఐ భైరగాని మునయ్య ఇంట్లో దొంగలు సుమారు 25 తులాల బంగారం, రూ.2 లక్షల  నగదు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనాన్ని గుర్తించకుండా సనీ పక్కీలో వారు ఇల్లంతా కారంపొడి చల్లి, తమ ముద్రలను కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

News November 12, 2024

జగన్.. పులివెందుల పౌరుషం ఉంటే రా: మంత్రి బీసీ

image

YS జగన్‌ మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.

News November 12, 2024

రాయచోటి: ‘రాష్ట్రంలో సంపద సృష్టి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు’

image

2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.