News January 2, 2025
కడపలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం

మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో ఆయన కడపకు చేరుకోగా కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కడప కలెక్టర్ శ్రీధర్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.
Similar News
News December 12, 2025
కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.
News December 12, 2025
నీటి భద్రతపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది: కలెక్టర్

నీటి భద్రతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం ఢిల్లీలో ఐఐటీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లా రివర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ కింద జిల్లా స్థాయి నీటి నిర్వహణపై ప్యానలిస్ట్‌గా మాట్లాడారు. జిల్లాలో సమర్థవంతమైన నీటి భద్రత, సంరక్షణ నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.