News January 31, 2025
కడపలో టీడీపీ ‘మహానాడు’

టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహిస్తున్నట్లు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మే నెలలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కడపలో నిర్వహిస్తున్నారు.
Similar News
News February 8, 2025
కడప: వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి.!

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు.
News February 7, 2025
ప్రొద్దుటూరులో యువకుడి హత్య.?

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని ఇటుకల బట్టీలలో యువకుడి ఆత్మహత్య అంటూ మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తమ కుమారుణ్ని ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటే పోలీసులు వెళ్లకుండానే ఎలా మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
News February 7, 2025
DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.