News February 14, 2025

కడపలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

image

కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.

Similar News

News December 15, 2025

కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

image

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.

News December 15, 2025

దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

News December 15, 2025

ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

image

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.