News February 14, 2025
కడపలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.
Similar News
News July 11, 2025
ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.
News July 10, 2025
కడప జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
News July 10, 2025
కడప MLA తీరుపై విమర్శలు

మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.