News February 9, 2025

కడపలో పాఠశాల విద్యార్థి ఆత్మహత్య

image

కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల నారాయణ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కొప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.

Similar News

News March 20, 2025

23న వేంపల్లెకి రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన వేంపల్లె పట్టణానికి రానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి అనంతరం వేంపల్లెలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుకి వెళ్తారని అధికారిక సమాచారం అందింది.

News March 20, 2025

వైవియూ దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. వైవీయూ అధ్యయన కేంద్రాల్లో ఎం.ఏ. ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం.కామ్. కోర్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు.

News March 19, 2025

కడప ZP ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

image

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27వ తేదీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామాతో ఇన్‌ఛార్జి జడ్పీ ఛైర్మన్‌గా శారద కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపైన ఆసక్తిగా మారింది.

error: Content is protected !!