News December 15, 2024
కడపలో ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్.?

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు తన సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగలనుందా.? కడప కార్పొరేషన్‌లో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు YCPని వీడి TDPలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన ఏడుగురు కార్పొరేటర్లు ఎల్లుండి CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.
Similar News
News October 25, 2025
రాజుపాలెం: కుందూనదిలో దంపతుల ఆత్మహత్యాయత్నం?

రాజుపాలెం మండలంలోని వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యాభర్తలు గొంగటి రామసుబ్బారెడ్డి, నాగ మునెమ్మ పడ్డారు. గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న భర్తను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నాగ మునెమ్మ గల్లంతయారు. ఆమె కోసం గజఈత గాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వీరు పెద్దముడియం మండలంలోని ఉప్పులూరుకు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 25, 2025
కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
News October 25, 2025
కడప జాయింట్ కలెక్టర్‌కు మరో బాధ్యత

కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) వైస్ ఛైర్మన్‌గా జేసీ అతిథి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. కడప జిల్లాకు జేసీ అతిథి పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.


