News October 14, 2024

కడపలో ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

image

నూతన మద్యం పాలసీకి సంబంధించి కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శివ శంకర్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో దుకాణానికి లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 139 మద్యం దుకాణాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Similar News

News October 14, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌ రాజీనామా ఆమోదం

image

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు విధుల నుంచి రిలీవ్ చేసినట్టు వైవీయూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.

News October 14, 2024

కడప: డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు వాయిదా

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావం అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

News October 14, 2024

కడప: కమిషనర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరణ

image

కడప నగర పరిధిలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఇన్‌ఛార్జ్ కమిషనర్ రాకేశ్ చంద్రం పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో అందించినట్లు చెప్పారు. మున్సిపాలిటీ సిబ్బంది చేత సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.