News February 5, 2025

కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి

image

మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.

Similar News

News February 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.

News February 17, 2026

నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

image

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.