News June 20, 2024
కడపలో యువకుడిపై కత్తితో దాడి

కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ పార్క్ సమీపంలో ఓ యువకుడు, మరో యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ సి.భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన యువకుడిని రిమ్స్కు తరలించారు. ఈ సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
News January 10, 2026
గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
News January 10, 2026
యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.


