News June 27, 2024
కడపలో యువతి ఆత్మహత్య

కడప నగరంలోని ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్న భాను శ్రీ అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు చిన్న చౌక్ ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. భాను శ్రీ కడప నగర శివార్లలోని బుడ్డాయిపల్లెలో ఉన్న కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. బుధవారం ఉదయం ఓ ఫంక్షన్‌కు వెళ్లే విషయంలో అక్కాచెల్లెళ్లు గొడవ పడడంతో తల్లి భాను శ్రీని మందలించింది. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News December 10, 2025
BREAKING: యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి

యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2025
కడప మాజీ మేయర్ సురేశ్‌కు హైకోర్టు షాక్.!

కడప మాజీ మేయర్ సురేశ్‌కు హైకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేపు కడప కొత్త మేయర్ ఎన్నిక యథావిధిగా జరగనుంది. గతకొన్ని రోజులక్రితం కడప మేయర్ పీఠంపై నుంచి సురేశ్ బాబును కూటమి ప్రభుత్వం తప్పించగా ఈసీ నోటిఫికేషన్‌పై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
News December 10, 2025
తొలగిన అడ్డంకులు.. రేపు యథావిధిగా కడప మేయర్ ఎన్నిక

కడప నగర నూతన మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రేపు ఉదయం జరగాల్సిన ప్రత్యేక సమావేశంలో నూతన మేయర్ ఎన్నికను జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక చెల్లదంటూ YCP నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సమగ్రంగా విచారణ జరిపి యథావిధిగా రేపు జరగవలసిన మేయర్ ఎన్నిక ప్రక్రియను కొనసాగించాలంటూ కాసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో రేపు నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు.


