News August 13, 2024

కడపలో రిహార్సల్స్ పరిశీలిన

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు రిహార్సల్స్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, ఆర్ఐలు ఆనంద్, వీరేశ్ పాల్గొన్నారు.

Similar News

News February 22, 2026

కాశినాయన మండలంలో దారుణం

image

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్ (24) అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.

News February 22, 2026

తిరుపతి: B.Ed విద్యార్థిని సూసైడ్

image

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే కోడూరులోని రంగనాయకులపేటలో B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 22, 2026

ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

image

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.