News June 15, 2024

కడపలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

image

కడప నగరంలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. జువెలరీ ప్రధాన రహదారికి ఇరువైపులా నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Similar News

News November 25, 2025

ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

image

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

News November 25, 2025

ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

image

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.

News November 25, 2025

కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

image

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.