News April 1, 2025

కడపలో హిజ్రాల ఆందోళన

image

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

Similar News

News April 4, 2025

మైదుకూరు : పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

image

మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు. 

News April 4, 2025

వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్‌ఛార్జ్ భేటీ

image

పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2025

కడప వాసులకు గర్వకారణం: తులసిరెడ్డి

image

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.

error: Content is protected !!