News August 2, 2024
కడప: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన గాజులపల్లె శివ కడప నబి కోటకు చెందిన కొప్పర్తి మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని కడప ఏడు రోడ్ల కూడలి వద్ద శివను షర్టు పట్టుకొని అసభ్యంగా తిడుతూ కొట్టాడు. దీంతో అవమాన భారంతో తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడని కుటుంబీకులు తెలిపారు.
Similar News
News November 27, 2025
కరెంట్ షాక్తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
News November 27, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


