News October 16, 2024
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

కడప నగరంలో నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుని దర్గా పెద్దలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను మంగళవారం కలిసి దర్గా ముతావల్లి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం సానుకూలంగా స్పందించారని మత పెద్దలు తెలిపారు.
Similar News
News November 24, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.
News November 24, 2025
ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.
News November 24, 2025
ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.


