News September 28, 2024
కడప అమ్మాయికి అవార్డు

కడప పట్టణానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని ఉత్తమ సోషల్ మీడియా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల మీద సామాజిక మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.
Similar News
News November 17, 2025
మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.