News November 19, 2024
కడప: ‘అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి’
అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, పరిష్కరించాలన్నారు.
Similar News
News December 10, 2024
14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు
వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.
News December 9, 2024
రాయచోటిలో టీచర్ మృతి.. విద్యార్థుల అరెస్ట్
రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ZPHSలో ఉపాధ్యాయుడు అహ్మద్(42) మృతి కేసులో ఇద్దరు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై టీచర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
News December 9, 2024
పులివెందుల యువతిని పొడిచిన వ్యక్తి అరెస్ట్?
కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలతో SI ప్రవీణ్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారై ఓ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత సీరియస్ అయిన విషయం తెలిసిందే.