News August 14, 2024
కడప: ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకం

ఈ ఏడాది ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదలకు గానూ 3 విడతలుగా వివిధ కేటగిరీలకు చెందిన 20 మంది జాబితాను హోంశాఖ వారికి జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఖైదీల విడుదల ఉండదని, గాంధీ జయంతి రోజున విడుదల చేస్తామని ఇటీవల ఓ సమావేశంలో హోం మంత్రి అనిత పేర్కొన్న నేపథ్యంలో ఆగస్టు 15న ఖైదీల విడుదల లేనట్లేనని తెలుస్తోంది.
Similar News
News November 9, 2025
విజయవంతమైన జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ

ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎన్నికచేసినట్లు వివరించారు. వీరు ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొటారన్నారు.
News November 8, 2025
ప్రొద్దుటూరు: అధికార పార్టీనే వీరి అడ్డా..!

ప్రొద్దుటూరు క్రికెట్ బుకీల గురించి వైసీపీ, టీడీపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పేరుమోసిన క్రికెట్ బుకీలంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటున్నారు. అధికార పార్టీ నుంచి కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. 2014-19లో టీడీపీలో ఉన్న క్రికెట్ బుకీలు, 2019లో వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024లో వైసీపీ ఓడిపోగానే మళ్లీ టీడీపీలోకి వచ్చారు. క్రికెట్ బుకీలు అధికారం అండలోనే ఉంటున్నారు.
News November 8, 2025
కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరికి 3 ఏళ్లు జైలు

2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్లో కులం పేరుతో బంగ్లా రమేష్పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసును డీఎస్పీ సూర్యనారాయణ విచారించగా, ప్రత్యేక పీపీ బాలాజీ సమర్థవంతమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.


