News September 11, 2024

కడప: ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్సుపై కేసు

image

కడప నగరంలోని కలెక్టరేట్‌ ముందు సోమవారం గ్రీవెన్స్ సమయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్స్ బి.చిన్నమ్మపై మంగళవారం కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమ్మ తనను డాక్టర్ చెన్నకృష్ణ ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి ప్రయత్నం చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 25, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:

News November 25, 2025

ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

image

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

News November 25, 2025

ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

image

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.