News July 12, 2024
కడప ఆర్ట్స్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూ

కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన వారికి ఈ నెల 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. జి రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియాలజీ, జువాలజీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తామన్నారు.
Similar News
News February 9, 2025
పులివెందులలో పులి కలకలం.. వాస్తవం ఇదే.!

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పులి అడుగులు కనిపించాయని వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు శనివారం రాత్రి పొలాల్లో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి పులి సంచరిస్తుందని చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అడుగులు పులివి కావని నిర్ధారించారు. ఈ తనిఖీల్లో సీఐ నరసింహులు, ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
News February 8, 2025
జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.
News February 8, 2025
కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.