News September 17, 2024
కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి

వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
Similar News
News December 20, 2025
కమలాపురంలో వైజ్ఞానిక ప్రదర్శన.. 11 జట్ల ఎంపిక

కమలాపురం CSSR కాలేజీలో సత్యేంద్రనాథ్ బోస్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి హాజరై విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రదర్శనలో 11 జట్లు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ సీవీ రాజగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
News December 20, 2025
కడప జిల్లా యువతకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు

గుంటూరులోని KL యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో YSR కడప జిల్లా విద్యార్థిననులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో పొయెట్రీ విభాగంలో హీనఫిర్హత్ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. స్టోరీ విభాగంలో వెంకట సాహిత్య ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీరిద్దరూ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు.
News December 20, 2025
ఖాకీ చొక్కా ధరించిన కడప బిడ్డలు..!

కడప జిల్లా వ్యాప్తంగా 110 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. కడప నియోజకవర్గానికి చెందిన 13 మంది యువత కానిస్టేబుల్‌లుగా ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే మాధవి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన యువత జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు.


